చైతు ‘చి. ల.సౌ’..

అందాల రాక్షసి చిత్రం తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్..ఆ తర్వాత అలా ఎలా, శ్రీమంతుడు, టైగర్ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దర్శకుడిగా మారి హీరో సుశాంత్ తో ‘చి. ల.సౌ’ అనే సినిమాను తెరకెక్కించాడు. కేవలం ఈ సినిమాను 40 రోజుల్లో పూర్తి చేసి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా ద్వారా రుహని అనే అమ్మాయి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ‘మెంటల్ మదిలో’ సినిమాకు సంగీతం అందించిన ప్రశాంత్ విహారి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.


తాజాగా ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ను హీరో అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ ద్వారా ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై జస్వంత్ ఈ సినిమాను నిర్మించారు. గత కొంతకాలం గా హిట్ అంటే ఏంటో తెలియకుండా ఉన్న సుశాంత్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.