Site icon TeluguMirchi.com

పిక్ టాక్ : ‘c/o సూర్య’

కార్తీ చేసిన యాక్షన్ త్రిల్లర్ నా పేరు శివ. ఇప్పుడు ఆ సినిమా కు సీక్వెల్ తయారవుతోంది. ఈ సీక్వల్ సందీప్ కిషన్ చేస్తున్నాడు. సందీప్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో తయారయ్యే ఈ సినిమాకుదాదాపు నాపేరు శివ టీం పనిచేస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వం వహించే ఈ సినిమా లవ్ అండ్ రివెంజ్ ఫార్ములాతో వుండబోతుంది.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో సూర్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా యూనిట్ మాట్లాడుతూ.. ‘నా పేరు శివ’ తరహాలో తెరకెక్కుతున్న మా చిత్రం టైటిల్‌ ‘c/o సూర్య’, ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ హీరో సూర్య చేతుల మీదుగా విడుదల చేశాం. సుసీంద్రన్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. ఇందులో సందీప్‌ ఓ మధ్యతరగతి యువకుడిగా కనిపించబోతున్నాడు. జులైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని వెల్లడించారు.

Exit mobile version