సూర్య భయపెట్టబోతున్నాడు

sutrya
తమిళ స్టార్ హీరో సూర్య వైవిధ్యమైన పాత్రలు చేయడంలో ముందుంటారు. గజని, సెవెన్త్ సెన్స్, బ్రదర్స్, వంటి సినిమాల్లో సూర్య విభిన్నంగా కనిపించారు. ఇపుడు మరో విభన్నమైన పాత్ర పోషించాడని సిద్ధమయ్యాడు. సూర్య మొట్టమొదటి సారిగా దెయ్యం పాత్రలో కనిపించడానికి అంగీకరించినట్లు సమాచారం. బిర్యానీ’ ఫేం వెంకట్ ప్రభు దర్శకత్వంలో సూర్యా ఓ సినిమా చేయాడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సూర్య డబుల్ రోల్ పోషించనున్నాడట. వీటిలో ఒకటి దెయ్యం పాత్ర అని కోలీవుడ్ సమాచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఇద్దరు సూర్యలకు ఇద్దరు అందాల భామలు రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. నయనతార, ఎమీ జాక్సన్. త్వరలోనే ఈ చిత్రానికి పూర్తి వివరాలు తెలుస్తాయి.