Site icon TeluguMirchi.com

అంచనాలు పెంచుతున్న సూర్య 37 వ చిత్రం…

హీరో సూర్య కు తమిళం లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుగు లోను అలాగే ఉంది. ఈయన నటించిన అన్ని చిత్రాలు తమిళ్ తో పాటు తెలుగు లో విడుదలై మంచి ఆదరణ పొందుతాయి. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అందులో ఒకటి సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ కాగా మరోటి వీడొక్కడే ఫేమ్ కేవీ ఆనంద్ డైరెక్షన్లో తన 37 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతుంది. భారీ బడ్జెట్ తో పాటు భారీ కాస్ట్ & క్రూ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.

ఈ మూవీ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ , హిందీ విలక్షణ నటుడు బోమన్ ఇరానీ , అల్లు శిరీష్ మొదలగు భారీ తారాగణం తో పాటు మరో స్టార్ హీరో ఆర్య కూడా ఉన్నాడు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. సుమారు 10 దేశాలలో షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. సాయేషా హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఎన్జీకే విషయానికి వస్తే దీపావళి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version