Site icon TeluguMirchi.com

సూర్య ఖాతాలో మ‌రో రెండు…

singamత‌మిళ న‌టుడు సూర్య…. దూసుకుపోతున్నారు. ప్రస్తుతం సింగ‌మ్ కొన‌సాగింపు చిత్రంలో న‌టిస్తున్నారు. అనుష్క, హ‌న్సిక క‌థానాయిక‌లు. మ‌రో రెండు సినిమాల్ని అంగీక‌రించారు. త్వర‌లో లింగుస్వామి ద‌ర్శక‌త్వంలో న‌టించ‌డానికి ఆయ‌న ఓకే చెప్పారు. పందెం కోడి లాంటి స్టైలీష్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ తీసిన ద‌ర్శకుడాయ‌న‌. ఈ సినిమా పాటు గౌత‌మ్‌మీన‌న్ చిత్రంలోనూ చేస్తారు. సూర్య స‌న్నాప్ కృష్ణన్ సినిమా వీరిద్దరి క‌ల‌యిక‌లోనే వ‌చ్చింది. ఆ సినిమాఓ మోస్తరు విజయాన్ని ద‌క్కించుకొంది. ఈసారి ఎలాగైనా విజ‌యతీరాల‌కు చేరాల‌ని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ ఇంచుమించు ఒకే స‌మ‌యంలో సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. క‌థానాయిక‌లెవ‌ర‌నే సంగ‌తి త్వర‌లో తెలుస్తుంది.

Exit mobile version