Site icon TeluguMirchi.com

సూర్య ‘గ్యాంగ్ స్టర్’ అయ్యాడు

suryaసింగం 2తో త‌న స్టామినా చూపించాడు సూర్య‌. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకొంది. అదే ఊపులో మ‌రో మాస్ మ‌సాలా సినిమాకి ఓటేశాడు. యాక్షన్ క‌థ‌ల్ని వండి వడ్డించ‌డంలో లింగు స్వామి దిట్ట‌. ఈ సారి ఆయ‌న‌తో చేతులు క‌లిపాడు సూర్య‌. వీరిద్దరి సినిమా సెట్ప్‌పైకి వెళ్ళింది. ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించండున్నాడు. సూర్యతో స‌మంత ఆడిపాడ‌నుంది. రౌడి అనే టైటిల్ పరిశీలనలో వుంది. సింగంలో పోలీస్‌గా మెప్పించిన సూర్య‌, గ్యాంగ్ స్టర్ గా ఎన్ని మార్కులు కొట్టేస్తాడో చూడాలి.

Exit mobile version