Site icon TeluguMirchi.com

Retro : సూర్య ‘రెట్రో’ టీజర్ విడుదల..


Retro : కోలీవుడ్ స్టార్ సూర్య, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన తదుపరి చిత్రం #Suriya44 చేస్తున్న సంగతి తెలిసిందే. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌ మరియు 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సూర్య పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటిస్తుంది. తాజాగా క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం టైటిల్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్రానికి ‘రెట్రో’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఇక టీజర్ చూస్తుంటే ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్ మరియు ఎమోషనల్ డ్రామా గా రాబోతుందని తెలుస్తుంది. సూర్య డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకోగా, పూజా హెగ్డే చాలా హోమ్లీగా కనిపించింది. ఇక సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషనల్ మరియు యాక్షన్ ప్యాక్డ్ మూమెంట్స్ ని ఎలివేట్ చేసింది. ఇకపోతే జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Exit mobile version