Site icon TeluguMirchi.com

డ్రగ్స్‌ కేసులో సురేష్‌బాబు తనయుడు?

టాలీవుడ్‌ను షేక్‌ చేస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ఉంది. నోటీసులు అందుకున్న టాలీవుడ్‌ సెలబ్రెటీలు ఈనెల 19న పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. టాలీవుడ్‌లో లెక్కకు మించి సెలబ్రెటీలు డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. అయితే కొద్ది మందికి మాత్రమే నోటీసులు అందాయి. సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ డ్రగ్స్‌ను తీసుకుంటున్నట్లుగా కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే సురేష్‌బాబు తనకున్న బ్యాక్‌గ్రౌండ్‌తో తన కొడుకు పేరును లిస్ట్‌లో లేకుండా చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎక్కువగా పబ్‌లలో తిరిగే సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్‌ కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

ఈ విషయమై నిర్మాత సురేష్‌బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తన కొడుకు అభిరామ్‌ డ్రగ్స్‌ తీసుకుంటాడు అనే వార్తలను ఆయన కొట్టి పారేశాడు. తన కొడుకు అలాంటి వాడు కాదని, ఒక వర్గం మీడియా వారు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తప్పుబట్టాడు. సాక్షాధారాలు లేకుండా తన కొడుకును ఎలా దోషిగా చిత్రీకరిస్తారు అంటూ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో ఇలా పలువురి గురించి కూడా తప్పుడు కథనాలు వస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ప్రకటించే వరకు వేచి ఉండాలని సినీ వర్గాల వారు మీడియాకు సూచిస్తున్నారు.

Exit mobile version