బన్నీ దర్శకుడికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ?

charan‘కిక్’ చిత్రంతో ఆకట్టుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ తో ‘ఊసరవెల్లి’ కాస్త నిరాశ పరిచిన దర్శకుడి గా సురేందర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు బన్ని తో ‘రేసు గుర్రం’ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో మెగా ఆఫర్ కొట్టేశాడు సురేందర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ చెప్పిన స్టొరీ లైన్ కి ప్లాట్ అయ్యాడట. సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ లైన్ చరణ్ కి నచ్చిందనీ, దానిని డెవలప్ చేయమని చెప్పాడనీ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇందుకు సంభందించిన ఆధికారిక ప్రకటన రావాల్సి వుంది.