తమకెదురైన ప్రతి సవాల్‌నూ అధిగమించేలా వినియోగదారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మౌంటెన్ డ్యూ నేడు, తమ ఉత్సాహపూరితమైన వేసవి ప్రచారాన్ని సూపర్‌స్టార్ మరియు బ్రాండ్ అంబాసిడర్ మహేష్‌బాబుతో ప్రారంభించింది. ఆకట్టుకునే రీతిలో ఉద్విగ్నభరితంగా తీర్చిదిద్దిన ఈ చిత్రం, మౌంటెన్ డ్యూ సిద్ధాంతం అయిన ‘డర్ కే ఆగే జీత్ హై’ను కలిగి ఉండటం మాత్రమే కాదు వినియోగదారులను తమ సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది.
ఈ చిత్రంలో, సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఓ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధపడతాడు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఓ కార్గో విమానం నుంచి ఫ్రీఫాల్ స్టంట్ చేస్తాడు. అత్యంత ఎత్తులో ఉండటం వల్ల సిబ్బంది అంతా అతను సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తాడా లేదా అన్న ఆందోళనలో ఉంటారు. ఈ స్టంట్‌ను ముగించాలనే సంకల్పంతో , మహేష్ బాబు మౌంటెన్ డ్యూ ఓ గుటక వేయడంతో పాటుగా సాహసానికి సిద్ధమవుతాడు. ఈ చిత్రం ఓ ప్రోత్సాహపూరిత సందేశంతో ముగుస్తుంది. తన ప్రయాణంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ మహేష్‌బాబు తన మోటర్‌సైకిల్‌తో సహా విజయవంతంగా మరో కార్గో ప్లేన్‌లో చేరతాడు.
ఈ చిత్రం గురించి బ్రాండ్ అంబాసిడర్ మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘భయాన్ని అధిగమించే ధైర్యం, తెలియని ఉద్వేగం– మౌంటెన్ డ్యూ యొక్క వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా నాతో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ యాక్షన్ ప్యాక్డ్ చిత్రం కోసం ఈ టీమ్‌తో మరలా కలవడం చాలా ఆనందంగా ఉంది. దీనిలో యాక్షన్ మాత్రమే కాదు ఎడ్వెంచర్ కూడా ఉంది’’ అని అన్నారు.
ఈ ప్రచారం గురించి పెప్సీ కో ఇండియా, మౌంటెన్ డ్యూ , కేటగిరి డైరెక్టర్ వినీత్ శర్మ మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబుతో మా అనుబంధం కొనసాగిస్తుండటం పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. ఈ వేసవి సీజన్ కోసం మా నూతన ప్రచారాన్ని మౌంటెన్ డ్యూ కోసం విడుదల చేశాము. ఇది బ్రాండ్ యొక్క ‘డర్ కే ఆగే జీత్ హై’ సిద్ధాంతాన్ని బలోపేతం చేస్తుంది. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరినీ భయాలు అధిగమించండి, విజేతలుగా నిలవండి అని ప్రోత్సహిస్తారు. ఈ ప్రచారాన్ని వినియోగదారులతో పాటుగా విభిన్నమైన అభిరుచులు కలిగిన మహేష్‌బాబు అభిమానులను సైతం ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాము. అంతేకాదు, ఇది వారికి ఆత్మవిశ్వాసం కలిగించడంతో పాటుగా మౌంటెన్ డ్యూ రుచిని సైతం కోరుకునేలా చేస్తుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.