సన్నీ న్యూ మూవీ స్టార్ట్..

పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ స్టార్ గా మారిన సన్నీ లియోన్..వరుస ఛాన్సులతో కొమ్మేస్తుంది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తెలుగు , తమిళ్ భాషల్లో కూడా అమ్మడికి ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సన్నీ , ఇప్పుడు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న పిరియాడికల్ వార్ మూవీ లో నటిస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈరోజు చెన్నైలో మొదలైంది.

ఈ మూవీ కోసం సన్నీ ఏకంగా 150 రోజుల కాల్ షీట్లను కేటాయించిందని సమాచారం. ‘వీరమాదేవి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన ఈ మూవీ ని విసి. వడివుడియన్ డైరెక్ట్ చేస్తుండగా , తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతుంది. ఇందులో సన్నీ వారియర్ క్వీన్ గా కనబడనుంది. 2019 వేసవికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.