Site icon TeluguMirchi.com

పెను ప్రమాదం నుండి బయటపడ్డ సన్నీ

బాలీవుడ్‌ ఐటెం గర్ల్ సన్నీ లియోని విమాన ప్రమాదం నుంచి తృటిలో తప్పింకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ ద్వారా తెలుపుతూ వీడియోను పోస్ట్‌ చేసింది. తమ విమానం ప్రమాదానికి గురి కాబోయిందని, ఇప్పుడు తాము మహారాష్ట్రలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నామని సన్ని ఈ వీడియో లో చెప్పింది.

‘మేము ప్రాణాలతో వున్నాం. థ్యాంక్ గాడ్. వాతావరణం అనుకూలించని కారణంగా మా ప్రైవేటు విమానం ప్రమాదానికి గురి కాబోయింది’ అని సన్ని ట్వీట్‌ చేసింది. తమ పైలట్స్‌ అద్భుతమైన నైపుణ్యం కలవారని, వారి చేతుల్లో ఉన్న తమ జీవితాలను కాపాడారని వెల్లడించింది సన్ని .

Exit mobile version