పవర్‌ఫుల్‌ పంచ్‌లతో మరోసారి రెచ్చిపోయిన సన్నీ

sunny-leone-in-Seethaశృంగారతార సన్నిలియోన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో తన హవా కొనసాగిస్తోంది. మొదట్లో హిందీకే పరిమితం అయిన ఈ అమ్మడు పలు భాషల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. తెలుగులో కూడా సన్నీకి తరుచుగా ఆఫర్‌లు అందుతున్నాయి. దేశ వ్యాప్తంగా క్రేజ్‌ ఉన్న సన్నిలియోన్‌కు అన్ని భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఎంతో మంది అభిమానులు ఉన్నా కూడా ఈమెను విమర్శించేవారు లేకపోలేదు. కొంతమంది సెలబ్రిటీలు కూడా సాటి నటీనటులపై పదునైన బూతులతో వేదిస్తుంటారు అంటూ సన్ని చెబుతోంది. బూతులతో వేదించే వారికి ఎలా బుద్ది చెప్పాలో తనకు తెలుసు అని, అలాంటి వారిని సోషల్‌ మీడియాలో ఉండకుండా బ్లాక్‌ చేస్తే మంచిదని సన్నీ అంటోంది.

మహిళా దినోత్సవం సందర్భంగా సన్నీ మాదిరిగా ప్రపంచంలోని మహిళలంతా కూడా మగాళ్లకు ఆనందాన్ని పంచాలి అంటూ వర్మ కారు కూతులు కూయగా మాటలను తెలివిగా వాడమని సన్నీ వర్మకు సలహా ఇచ్చింది. తాజాగా సన్నీలియోన్‌ కొందరు సోషల్‌ మీడియాను చెడ్డ పనులకే ఉపయోగిస్తున్నారు, సోషల్‌ మీడియా పవర్‌ తెలియక పబ్లిక్‌ టాయిలెట్‌ మాదిరిగా సోషల్‌ మీడియాను వినియోగిస్తున్నారు, అలాంటి వారిని బ్లాక్‌ చేసి అందరు వారికి తగిన బుద్ది చెప్పాలంటూ పవర్‌ ఫుల్‌ మాటలతో సన్నీ రెచ్చిపోయింది. సన్నీ కామెంట్స్‌ ఉవిరిని ఉద్దేశించి చేసిందో అని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.