సన్నీలియోన్.. పరిచయం అక్కర్లేని పేరు ఇది. పోర్న్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన సన్నీలియోన్, ఇప్పుడు బాలీవుడ్ అడల్ట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు ఐటెం సాంగుల్లో కూడా ఇరగదీస్తోంది సన్నీ. అయితే ఇప్పుడు తొలిసారి ఓ వార్ సినిమా చేయబోతుంది సన్నీ. అవును ఆమె ప్రధాన పాత్రగా ఒక చారిత్రక చిత్రం తెరకెక్కడానికి రంగం సిద్ధమవుతోంది.
పోన్స్ స్టీఫెన్ నిర్మాణంలో వి.సి.వడివుడయన్ ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో సన్నీ , అనుష్కని కాపీ కొట్టింది. కత్తి, విల్లు పట్టుకుని ఉంది సన్నీలియోన్ ఈ పోస్టర్లో….కాని ఈ పోస్టర్ చూసిన వారందరు ఇలాంటి పోస్టర్ను ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు మన స్వీటీ అనుష్క నటించిన ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో అనుష్క సేమ్ ఫోజు చూసి అందరూ సన్నీ అనుష్కని బాగానే కాపీ కొట్టిందని కామెంట్ చేస్తున్నారు