ముఖ్యంగా సెలబ్రిటీలకు కలిసొచ్చే కాలం ఇదే. న్యూ ఇయర్ వేడుకల్లో ఆడిపాడితే కాసుల వర్షం కురిపిస్తారని గట్టిగా నమ్ముతారు. అదే రీతిలో కొన్ని కార్పోరేట్ కంపెనీ లు తమ ఎంజాయ్ కోసం సినిమా తారలను ఎంచుకుంటారు. ఆ రాత్రి అంత తమతో ఆడిపాడితే తము అడిగింత ఇస్తామని ఆఫర్స్ ఇస్తారు. దీంతో చాల మంది హీరోయిన్స్ ఈ ఆఫర్స్ కోసం ఎదురుచుస్తారు. గతంలో బాలీవుడ్ భామలు కత్రినా, కరీనా, ప్రియాంక చోప్రాలు ఇలానే ఒక్కరాత్రి డాన్సులు చేసినందుకు కోట్లు వసూలు చేశారు.
ఇప్పుడు వాళ్లందరి కంటే సన్నీపైనే మనసు పారేసుకుంటున్నారు ప్రముఖులు. అమ్మడు డాన్స్ చేస్తే కోట్లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ కు చెందిన ఓ కార్పోరేట్ కంపెనీ పోర్న్ స్టార్ తో చిందులేయించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం అమ్మడికి రూ.5 కోట్లు ఇస్తున్నారట. డిసెంబర్ 31 రాత్రి జరిగే న్యూ ఇయర్ వేడుకల్లో సన్నీలియోన్ ఐటం పాటలకు చిందేయనుందట.
అసలే హైదరాబాద్ లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఆపై .. అమ్మడి సెక్సీ చూపులతో కొత్త ఏడాదిని స్వాగతం పలకాలని ఆ కార్పోరేట్ కంపెనీ కోట్లు ఖర్చుచేసి అమ్మడి చేత చిందులేయిస్తోందట.