సన్నిలియోన్‌ మాకు స్పెషల్…

Sunny-currentమంచు మనోజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సన్నిలియోన్‌ ప్రధాన పాత్రల్లో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కిన చిత్రం కరెంట్‌ తీగ. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ‘ఏ’ సర్టిఫికెట్‌ పొందింది. సెన్సార్‌ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. సినిమా చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు సన్నీ లియోన్‌ ఐటంసాంగ్‌ తొలగించాలని అలా అయితేనే U/A సర్టిఫికెట్‌ ఇస్తామని తేల్చి చెప్పారట. అయితే సినిమాకు ప్రధాన ఆకర్షణ సన్నీ లియోన్‌ ఐటం సాంగ్‌ ఉంటుందని మీరు ఎలాంటి సర్టిఫికెట్‌ ఇచ్చినా కూడా తీసివేసే ప్రసక్తే లేదని దర్శక నిర్మాతలు, హీరో ససేమిరా అన్నారు. దీంతో ఈచిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్‌ జారీ అయిందని మనోజ్‌ స్వయంగా చెప్పారు. సన్నీలియోన్‌ అంటే కేవలం శృంగార నటి మాత్రమే కాదని, ఆమె ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నటించిందని, ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన పలువురు సూపర్‌హిట్‌ అవుతుందని చెప్పడంతో పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.