వాసువ‌ర్మ‌తో సునీల్

sunil
జోష్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు వాసు వ‌ర్మ‌. నాగ‌చైతన్య ఎంట్రీ మూవీ ఇదే. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో వాసు వ‌ర్మ‌కి మ‌రో అవ‌కాశం ద‌క్క‌లేదు. అయితే వాసు వ‌ర్మ‌ని డైరెక్ట‌ర్‌గా మార్చిన దిల్‌రాజు… త‌న‌కి మ‌రో ఛాన్స్ ఇచ్చాడు. వాసువ‌ర్మ రెండో చిత్రం రేపు (బుధ‌వారం) ప్రారంభం కాబోతోంది. హీరో ఎవ‌ర‌నుకొంటున్నారు….?? అందాల రాముడు సునీల్. భీమ‌వరం బుల్లోడు త‌ర‌వాత సునీల్ సినిమాఏదీ ప‌ట్టాలెక్క‌లేదు. త‌నికెళ్ల భ‌ర‌ణి, మారుతితో సినిమాలు చ‌ర్చ‌ల వ‌ర‌కూ వెళ్లాయి. అయితే వాసు వ‌ర్మ‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడిప్పుడు. క‌థానాయిక‌, సినిమా టైటిల్ వివ‌రాలు మ‌రికొద్ది రోజుల్లో తెలుస్తాయి.