Site icon TeluguMirchi.com

అందాల రాముడికి క్యాన్సర్‌?

sunil1శీర్షిక చూసి కంగారు ప‌డొద్దు. సునీల్‌ కి క్యాన్సర్ అన్నమాట నిజ‌మే కానీ.. అది సినిమాల్లోనే. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘భీమ‌వ‌రం బుల్లోడు’. ఈ చిత్రంలో సునీల్ క్యాన్సర్ రోగిగా క‌నిపిస్తార‌ట‌. అలా క‌నిపించ‌డం వెనుక కూడా ఓ త‌మాషా కార‌ణం ఉంటుందట‌. అదెంట‌నేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సునీల్ స‌ర‌స‌న ఎస్తేర్ క‌థానాయిక‌గా న‌టించింది. అనూప్ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రచారం కూడా కాస్త విభిన్నంగానే చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. సంక్రాంతి సినిమాల హ‌డావుడి త‌గ్గాక ‘భీమ‌వ‌రం బుల్లోడు’ సినిమాని విడుద‌ల చేయాల‌ని డి.సురేష్ బాబు భావిస్తున్నారు. సునీల్ క్యాన్సర్ వ్యవ‌హారం తెలియాలంటే అప్పటి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Exit mobile version