Site icon TeluguMirchi.com

సునీల్ పై రూమర్స్ ఆగడం లేదు

హీరో సునీల్‌ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. గొంతు ఇన్‌ఫెక్షన్‌కు తోడు, వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్ల సునీల్‌ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు.

ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సునీల్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయినా, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆయన మరోసారి స్పందించారు.

తాను క్షేమంగానే ఉన్నానని సునీల్ తెలిపారు. తన ఆరోగ్యంపై కొందరు మిత్రులు ఆందోళన చెందుతున్నట్టు తనకు తెలిసిందని… ఈ పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికైనా ఈ పుకార్లకు తెర పడుతుందేమో వేచి చూడాలి.

Exit mobile version