సునీల్‌కు షాక్‌ ఇచ్చిన మాటల మాంత్రికుడు

కమెడియన్‌ సునీల్‌కు స్టార్‌ డం దక్కడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి త్రివిక్రమ్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాను రచయితగా ఉన్నప్పటి నుండి కూడా సునీల్‌కు మంచి పాత్రలు ఇవ్వడంతో పాటు, తాను దర్శకుడు అయిన తర్వాత మరింత మంచి పాత్రలను సునీల్‌కు త్రివిక్రమ్‌ ఇచ్చాడు. దాంతో సునీల్‌ స్టార్‌ కమెడియన్‌ అయ్యాడు. సునీల్‌ హీరోగా అంతగా సక్సెస్‌లు లేని సమయంలో మళ్లీ కమెడియన్‌గా ఆఫర్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్‌ ‘అరవింద సమేత’ చిత్రంలో అవకాశం ఇచ్చాడు.

ఇకపై త్రివిక్రమ్‌ తీసే ప్రతి సినిమాలో సునీల్‌ ఉంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో సునీల్‌కు మాత్రం ఛాన్స్‌ ఇవ్వడం లేదని తెలుస్తోంది. మొదట అనుకున్న ప్రకారం అయితే సునీల్‌ ఒక కీలక పాత్రలో కనిపించాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడం వల్ల సినిమాలో సునీల్‌ పాత్రను తీసేయడం జరిగింది. సునీల్‌ పాత్రకు కథలో ప్రాముఖ్యత లేకపోవడం వల్ల తీయడం జరిగిందని అంటున్నారు. సునీల్‌ వరుసగా కామెడియన్‌ పాత్రలు చేయాలనుకుంటే ఇలా అవుతుందని అంటున్నారు. స్నేహితుడు త్రివిక్రమ్‌ కూడా సునీల్‌ను ప్రస్తుత పరిస్థితుల్లో ఆదుకోవడం లేదు అంటూ టాక్‌ వినిపిస్తుంది.