అందాల రాముడు సునీల్ త్వరలో వీర్యదాతగా మారబోతున్నాడా? తప్పుగా అర్థం చేసుకోకండి. బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన చిత్రం విక్కీడోనర్…, వీర్యాన్ని అమ్ముకొనే ఓ యువకుడి కథ ఇది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి మధుర శ్రీధర్ దర్శకత్వం వహిస్తారు. కథానాయకుడి పాత్ర సునీల్‌ని వరించినట్టు సమాచారం. ఇంత వరకూ ఈ పాత్ర కోసం నానిని సంప్రదించారు మధుర శ్రీధర్. అయితే నాని కాల్షీట్లు సర్దుబాటు చేయడంలో విఫలమయినట్టు సమాచారమ్.., నాని కోసం ఎదురు చూసీ చూసీ విసిగిపోయిన మధుర శ్రీధర్ ఇప్పుడు ఈ స్ర్కిప్టు పట్టుకొని సునీల్ దగ్గరకు వెళ్లారట. సునీల్ కూడా ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు సమాచారమ్.., త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.