Site icon TeluguMirchi.com

బిగ్ బాస్ కోసం సునీల్ ఎంత డిమాండ్ చేసాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 జులై నెలలో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే హోస్ట్ గా నాగార్జున ను ఖరారు చేసిన యాజమాన్యం..పార్టిసిపెంట్స్ కోసం వేట సాగిస్తుంది . రెండో సీజన్ లో పెద్దగా పరిచయం లేని పార్టిసిపెంట్స్ ను సెలెక్ట్ చేసేసరికి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మూడో సీజన్ కోసం కాస్త క్రేజ్ ఉన్న నటి నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలువురిని సెలెక్ట్ చేయగా..తాజాగా హీరో కామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ ను సంప్రదించారట..అయితే సునీల్ అడిగిన రెమ్యూనరేషన్ కు షాక్ అయి గుండెలు పట్టుకున్నారట.

త‌న‌కి రోజుకి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు ముట్ట‌జెపితే బిగ్ బాస్‌లో పార్టిసిపేట్ చేస్తాన‌ని సునీల్‌ అన్నాడ‌ట‌. దీంతో నిర్వాహ‌కులు షాక్ కు గురయ్యారట. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కి రోజుకి ల‌క్ష‌లు రూపాయ‌లు మాత్ర‌మే ఇస్తుండ‌గా, సునీల్ అంత అడగడం ఏంటి అసలు అని వెనుదిరిగినట్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సునీల్ పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు.

Exit mobile version