Site icon TeluguMirchi.com

సుంద‌ర్ పాండ్యన్‌గా సునీల్‌?

sunilఅందాల రాముడు సునీల్ ఖాతాలో మ‌రో సినిమా చేరిందా?  త్వర‌లో ఆయ‌న భీమ‌నేని శ్రీ‌నివాస‌రావుతో జ‌త క‌ట్టబోతున్నారా??  అవున‌నే అంటున్నాయి ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం సుంద‌ర పాండ్యన్‌. క్రైమ్, కామెడీ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది.  ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌నుకొంటున్నారు భీమ‌నేని. త‌మిళంలో శ‌శికుమార్ పోషించిన పాత్రలో సునీల్ క‌నిపిస్తార‌ని స‌మాచార‌మ్‌. ప్రస్తుతం సునీల్‌, భీమనేని మ‌ధ్య క‌థాచ‌ర్చలు న‌డుస్తున్నాయి. ఈ సినిమా చేయ‌డానికి సునీల్ కూడా సుముఖంగానే ఉన్నారు. అయితే ఆయ‌న ఇంకా త‌న నిర్ణయాన్ని ప్రక‌టించాల్సివుంది.

Exit mobile version