సునీల్ – సన్నీ డియో డియోనే ..

సన్నీ లియోన్ ఈ పేరు గురించి చెప్పాల్సిన పనిలేదు. శృంగార దేవత గా అందరి మదిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ పోర్న్ స్టార్..ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి పోర్న్ చిత్రాలకు దూరమైంది. ప్రస్తుతం సౌత్ , నార్త్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. తాజాగా సన్నీ లియోన్ సినిమాలో టాలీవుడ్ హీరో కామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ నటించబోతున్నట్లు సమాచారం.

తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ‘కోకాకోలా’ అనే హిందీ హారర్ కామెడీ చిత్రంలో సునీల్ నటించబోతున్నట్లు సమాచారం. మహేంద్ర దరివాల్, పరమదీప్‌ సాందు నిర్మాతలుగా ప్రసాద్‌ తాటికేని దర్శకత్వంలో వస్తోన్న హారర్ కామెడీ చిత్రంలో సునీల్‌తో పాటు బ్రహ్మానందం కూడా నటిస్తున్నట్లు వినికిడి. త్వరలోనే వీరిద్దరూ ముంబై వెళ్లనున్నారని అంటున్నారు. కమెడియన్ గా స్టార్ స్టేటస్ లో ఉన్న టైం లో హీరోగా మరి బొక్క బోర్లా పడ్డ సునీల్..రీసెంట్ గా మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్నారు. ఇక ఇప్పుడు హిందీ సినిమా ఛాన్స్ రావడం పట్ల ఆయన అభిమానులు పండగా చేసుకుంటున్నారు.