Site icon TeluguMirchi.com

మరోసారి త్రివిక్రమ్ మనసు గెలుచుకున్న సునీల్..

సునీల్ , త్రివిక్రమ్ లు ఎంత మంచి స్నేహితులో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి సినీ ప్రయాణం ఒక్కసారే మొదలు అయ్యింది. ఒకే రూమ్ లో ఉంటూ సినిమా అవకాశాల కోసం పరుగులు తీశారు. ఒకరు రచయితగా మారితే..మరొకరు కమెడియన్ గా మారారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.

ఇక సునీల్ కమెడియన్ నుండి హీరో గా మారాడు . కానీ వరుస అపజయాలు రావడం తో మళ్లీ కమెడియన్ గా అరవింద సమేత తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక సునీల్ కెరియర్ ముగిసిపోతుందన్న క్రమం లో తన స్నేహితుడిని మళ్లీ నిలబెట్టాలని త్రివిక్రమ్ , ఈ సినిమాలో సునీల్ కు ఓ మంచి రోల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ చేసిన సహాయాన్ని సభ ముఖంగా చెప్పుకొచ్చాడు సునీల్.

ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో సునీల్ మాట్లాడుతూ..‘చిన్నప్పుడు అమ్మానాన్నలు ఏది మంచి, ఏది చెడో చెబుతారు. ఆపై గురువులు ఎన్నో విషయాలు నేర్పుతారు. కాస్త పెద్దవాళ్లం అవుతుంటే డబ్బులు లేనప్పుడు అన్నయ్యలు, పెద్దవాళ్లు ఆ లోటు లేకుండా చూస్తారు. హైదరాబాద్ వచ్చాక నాకు ఈ మూడు చూపించిన వ్యక్తి నా స్నేహితుడు త్రివిక్రమ్’ అని సునీల్ ఉద్వేగానికి లోనయ్యారు.

తనకు ఎన్నో విషయాలు నేర్పించి, డబ్బులు ఇవ్వడంతో పాటు సినిమాల్లో ఛాన్స్‌లు ఇచ్చి ఎంతో చేసిన వ్యక్తి త్రివిక్రమ్ అని చెప్పుకొచ్చాడు. తాను ఎన్ని వేషాలు వేసినా, అడిగితే నాకంటూ ఓ మంచి వేషం రాస్తాడన్న తన నమ్మకం, ధైర్యం త్రివిక్రమ్ అని సునీల్ తెలిపాడు.

Exit mobile version