ఉచితంగా మాస్క్ లను పంపిణి చేసిన సందీప్ కిషన్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. కరోనా పేరు చెపితేనే అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ కరోనా వల్ల ప్రజలు తమ పనులను పక్కన పెట్టి ఇంటికే పరిమితం అయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే..రెండు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ఎక్కువగానే ఉంది. లాక్ డౌన్ పటిష్టం గా కొనసాగుతున్న కానీ కరోనా కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రజల్లో ఇంకాస్త కరోనా ఫై అవగాహనా తెచ్చేందుకు అంత తమ వంతు కృషి చేస్తున్నారు .తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ ముందుకొచ్చి ప్రజలకు మాస్కులు పంచి పెడుతూ సేవాగుణాన్ని చాటుకుంటున్నాడు. తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ మాస్కులు – శానిటైజర్స్ పంచి పెడుతూ వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. .