Site icon TeluguMirchi.com

Sundeep Kishan : ‘ధమాకా’ డైరెక్టర్ తో సందీప్ కిషన్ మూవీ..


ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో హిట్ అందుకున్న సందీప్ కిషన్ తన ల్యాండ్‌మార్క్ 30వ మూవీ #SK30 కోసం ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాధరావు నక్కినతో జతకట్టారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని రాజేష్ దండా ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Kalki 2898 AD : ‘కల్కి’.. అన్నిటికీ అల్టిమేట్ క్లైమాక్స్ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

ఇక ఇటీవలే గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లవ్ అండ్ ఎమోషన్ తో నిండిన హార్ట్ వార్మింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్‌ క్యారెక్టరైజేషన్ కంప్లీట్ రిఫ్రెషింగా వుంటుంది. ఇక ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను రాశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version