’టైగర్’.. సందీప్ !

sandeep-kishan యువ హీరో సందీప్ కిషన్ జోరుమీదున్నాడు. వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఇచ్చిన హిట్ కిక్ తో రా రా కృష్ణయ్య, జోరు సినిమాలు చేసి ఊపుమీదున్నాడు. ఇప్పుడు ’టైగర్’ గా రానున్నాడు. అవును.. సందీప్ తాజా మూవీకి ’టైగర్’ టైటిల్ ని ఖరారు చేశారు. సీరత్ కపూర్ హీరోయిన్. అగ్ర నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్ దర్శకుడు. గంగానది నేపథ్యంలో సాగే కథ ’టైగర్’. ఈ కారణంగానే.. కాశీ, అలహాబాద్, రాజమండ్రి, విశాఖ, హైదరాబాదు ప్రాంతాలలో టైగర్ షూటింగ్ జరుపుకోనుంది. నిన్న (మంగళవారం) కాశీ టైగర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంగీతం తమన్. ఫోటోగ్రఫీ ఛోటా కె నాయుడు.