రకుల్ తో ఎఫైర్ పై సందీప్ రియాక్షన్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సందీప్ కిషన్ కెరీర్ లో మంచి హిట్. ఇందులో సందీప్ కిషన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్స్ గా కనిపించారు. ఈ సినిమా తర్వాత రకుల్ టాప్ హీరోయిన్ అయింది. అయితే సందీప్ కిషన్ కు ఆమెకు ముడిపెడుతూ కొన్ని వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా సందీప్ స్పదించాడు.

ఈ మేటర్ గురించి చాలా మంది అడిగారు. అలాంటిదేమీ లేదు. మేము చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. రకుల తోనే కాదు. రేజీనాతో కూడా ముడిపెట్టారు. నేనూ, రెజీనా కలిసి తమిళంలో నాలుగు సినిమాలు చేసినందుకు నాకూ-రెజీనాకు అఫైర్‌ ఉందని రాశారు. తను నాకో అబ్బాయిలాగానే. ఒకవేళ నాకు ఏ అమ్మాయితోనైనా ఉన్నా, ఆ విషయం బయటకు చెప్పను” అని చెప్పుకొచ్చాడు సందీప్.