Site icon TeluguMirchi.com

ఎంట‌ర్‌టైనింగ్‌గా ‘సుందరం మాస్టర్’ టీజర్ !!


హ‌ర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్ర‌ధాన తారాగ‌ణంగా ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్‌, గోల్ డెన్ మీడియా బ్యాన‌ర్స్‌పై క‌ళ్యాణ్ సంతోష్ దర్శ‌క‌త్వంలో ర‌వితేజ‌, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాత‌లుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టార్’. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. అందులో అన్నీ వ‌య‌సుల‌వారు ఇంగ్లీష్ నేర్చుకోవ‌టానికి విద్యార్థులుగా వ‌స్తారు. మ‌రి సుంద‌రం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విష‌యం ఎంట‌ర్‌టైనింగ్‌గా రూపొందించిన చిత్ర‌మే ఇది. ఈ సినిమా టీజ‌ర్‌ను సుప్రీమ్ హీరో సాయితేజ్ విడుద‌ల చేశారు. టీజర్ చూస్తేనే అర్ధమైతంది సినిమా ఎంత ఎంట‌ర్‌టైనింగ్‌గా వుండబోతుందో అని. ఇక టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం వైజాగ్‌లో జ‌రిగింది. ఈ కార్యక్రమంలో…

సుప్రీమ్ హీరో సాయితేజ్ మాట్లాడుతూ.. “సుందరం మాస్టర్ టీజర్ రిలీజ్ చేయటానికి ఐదు కార‌ణాలు.. అక్ష‌ర‌, ర‌మ‌గారు, రావుగారు మొద‌టి మూడు కార‌ణాలు. హ‌ర్ష వాళ్ల‌బ్బాయే. త‌ను బాగా న‌టిస్తాడు. ఇంకా మంచి స్థాయికి చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నా వాళ్ల‌కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. ఇక నాలుగో కార‌ణం.. నా ఫేవ‌రెట్ హీరో ర‌వితేజ‌గారు. ఆయ‌న నాకు చాలా చిన్న చిన్న విలువైన విష‌యాల‌ను నేర్పించారు. ఆయ‌న కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఐదో కార‌ణం.. ప్రేక్ష‌కుల ప్రేమను పొంద‌డానికే వచ్చాను. మా సుంద‌రం మాస్ట‌ర్ టీమ్‌.. డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ సంతోష్‌, సుధీర్ వ‌ర్మ‌గారికి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్‌గారికి.. అంద‌రికీ మీ ప్రేమ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాను” అన్నారు.

Exit mobile version