అక్కినేని వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్‌కు మొదట్లో సినిమాలు పర్వాలేదు అనే టాక్‌ను తెచ్చి పెట్టాయి. యువ హీరోల జోరు బాగా పెరగడంతో సుమంత్‌కు పెద్దగా విజయాలేవి దక్కలేదు. హిట్లు లేకున్నా కూడా సుమంత్ తరుచుగా కొత్త కొత్త ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గత ఏడాది ‘నరుడా డోనరుడా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి సుమంత్ ఓ విదేశీ భామతో చక్కర్లు కొడుతున్నారు. గతంలో కీర్తి రెడ్డిని పెళ్లాడి ఆ తర్వాత విడాకులు తీసుకున్న సమంత్ ఇన్నాళ్లు ఒంటరిగా ఉంటూ వస్తున్నాడు.
సుమంత్ ఓ ఫారిన్ పోరీతో గతకొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఈ ఇద్దరు హోటల్లో దర్శణం ఇచ్చారు. కానీ మొదట్లో ఎవరు పట్టించుకోలేదు. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఇద్దరు సన్‌రైజర్స్ తరుపున టీంను బాగా ఎంకరేజ్ చేస్తు మ్యాచ్‌లో సందడి చేశారు. మ్యాచ్‌లో ఈ ఇద్దరిని చూసిన వారు ఇద్దరి మద్య కచ్చితంగా లవ్ ఉంది అని అనుకుంటున్నారు. సుమంత్ మాత్రం కేవలం స్నేహితురాలు మాత్రమే అంటున్నాడు కానీ ఇంత సన్నిహితంగా ఉన్నాడంటే కచ్చితంగా ఇది ప్రేమే అని తెలుస్తోంది.