బాలీవుడ్ కు నో చెప్పాడు!

sukumarమనోళ్ళుకు బాలీవుడ్ ఆఫర్ వస్తే చాలు క్రేజ్ కు కొలమానం గా ఫీలైపోతారు. బాలీవుడ్ లో ఒక్క చాన్స్ వచ్చిందంటే తమలోని స్టఫ్ కు గుర్తింపుగా భావిస్తుంటారు. ఆఫర్స్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే దర్శకుడు సుకుమార్ మాత్రం ఇందుకు భిన్నం. ఈజీగా వచ్చిన బాలీవుడ్ ఆఫర్ కు అంతే ఈజీగా నో చెప్పాడు. వివరాల్లోకి వెళితే.. హిట్ చిత్రాలను రీమేక్ చేసి కోట్లు కొల్లగొట్టడం బాలీవుడ్ కు బాగా తెలుసు. ఇదే క్రమంలో బాలీవుడ్ దృష్టి ఆర్య 2పై ప‌డింది. అల్లు అర్జున్ – సుకుమార్ క‌ల‌యికలో వ‌చ్చిన చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయాల‌ని చూస్తున్నారు. ఓ యంగ్ హీరోతో ఈ సినిమా తీయాల‌ని భావిస్తున్నారు. ఈ సినిమాకి డైరెక్ట్ చేసి పెట్టమ‌ని సుకుమార్‌నే అడిగార‌ట‌. కాని సుకుమార్ ఈ ఆఫర్ కు సున్నితంగా నో చెప్పేశాడు. అయితే రిమేక్స్ చిత్రాలు చేయడం ఇష్టం లేకే ఈ ఆఫర్ ను  వదిలేశాడని వినిపిస్తోంది.