Site icon TeluguMirchi.com

ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయనున్న సుకుమార్ !

sukumarయంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. నిర్మాత బీవీయస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించనున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఎన్టీఆర్ కు సుకుమార్ చెప్పిన కథ విపరీతంగా నచ్చిందట. దీంతో.. సుకుమార్ కు తారక్ డేట్స్ కూడా ఇచ్చేసాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ’జోరు’ సినిమాతో, సుకుమార్ ప్రిన్స్
మహేష్ తో ’1’ నేనొక్కడినే చేస్తూ బిజీగా వున్నారు. ఇవి రెండూ కంప్లీట్ కాగానే.. అంటే వచ్చే ఎడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్తుందన్న మాట. హీరోలోనూ..నెగటివ్ షేడ్స్ చూపించి షేక్ చేసే సుకుమార్ ఎన్టీఆర్ ని ఎలా డిజైన్ చేస్తాడో మరీ..!

 

Exit mobile version