‘బాద్ షా’ డబ్బింగ్ పూర్తి చేసిన సుహాసిని మణిరత్నం

suhasini-wraps-up-dubbing-for-ntr-baadshaరాఖీ చిత్రంలో పవర్ ఫుల్ పోలిష్ ఆఫీసర్ గా కనిపించిన విలక్షణ నటి సుహాసిని మణిరత్నం ఇప్పుడు ‘బాద్ షా’ కు తల్లిగా జీవించబోతున్నారు. శ్రీను వైట్ల తెరక్కికిస్తున్న ఈ డబుల్ డోస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో సుహాసిని పాత్రను అద్భుతంగా తెరకెక్కించారట. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేసారు సుహాసిని. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నవదీప్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ను మార్చి 10న రీలిజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.