ఆక‌ట్టుకుంటోన్న సుహాస్‌ ‘శ్రీ‌రంగ‌నీతులు’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్


సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ‘శ్రీ‌రంగ‌నీతులు’. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మల‌తో కూడిన ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సినిమాపై మ‌రింత ఇంట్ర‌స్ట్‌ని క్రియేట్ చేసింది. ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అతి త్వ‌ర‌లోనే థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్‌.

ఇకపోతే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, ‘సేవ్ ది టైగ‌ర్స్’ ఫేమ్ అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నునున్నారు.