Site icon TeluguMirchi.com

Prasanna Vadanam Teaser : వింత వ్యాధితో బాధపడుతున్న సుహాస్..


రీసెంట్ గా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో హిట్ అందుకున్న సుహాస్ ఇప్పుడు ‘ప్రసన్న వదనం’ అంటూ మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

Prasanna Vadanam Teaser | Suhas | Viva Harsha | Arjun Y K | Vijay Bulganin

ఇక టీజర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. సుహాస్ తన అమ్మ నాన్నల ఫోటోని గుర్తుపట్టని హాస్పిటల్ సీన్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ప్రేక్షకులని కట్టిపడేసింది. ఈ సినిమాలో సుహాస్ ‘ఫేస్ బ్లైండ్ నెస్’ అనే వింత వ్యాధితో బాధపడుతుంటాడు. అంటే ఎవరి మొహాలను గుర్తు పట్టలేడు. అలాంటి ఒక వ్యక్తి జీవితం ఎలా వుంటుందనే నేపథ్యంలో ఈ కథ ఉండబోతుంది. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు. వైవా హర్ష, నందు, నితిన్, హర్ష వర్ధన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version