Site icon TeluguMirchi.com

Suhas New Movie : మరో కొత్త సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సుహాస్


‘కలర్ ఫోటో’తో ప్రేక్షకుల మనసులు దోచుకొని, ‘రైటర్ పద్మభూషణ్’తో భారీ విజయాన్ని అందుకున్న సుహాస్, మరో కథాబలం ఉన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ ప్రొడక్షన్ నంబర్ 2 చిత్రానికి గోపి ఆచార దర్శకత్వం వహించనున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’కి కథ అందించి ప్రశంసలు అందుకున్న షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు కథను సిద్ధం చేశారు. ఈ చిత్రం పక్కా ఫన్ రైడ్ అవుతుందని చిత్ర నిర్మాత నమ్మకంగా ఉన్నారు. సహజమైన హాస్యానికి, అద్భుతమైన కామెడీ టైమింగ్‌కి పేరుపొందిన సుహాస్, ఈ సినిమాలో హిలేరియస్ పాత్ర పోషించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి, జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.

Exit mobile version