‘కలర్ ఫోటో’తో ప్రేక్షకుల మనసులు దోచుకొని, ‘రైటర్ పద్మభూషణ్’తో భారీ విజయాన్ని అందుకున్న సుహాస్, మరో కథాబలం ఉన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మించనున్న ఈ ప్రొడక్షన్ నంబర్ 2 చిత్రానికి గోపి ఆచార దర్శకత్వం వహించనున్నారు. ‘రైటర్ పద్మభూషణ్’కి కథ అందించి ప్రశంసలు అందుకున్న షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు కథను సిద్ధం చేశారు. ఈ చిత్రం పక్కా ఫన్ రైడ్ అవుతుందని చిత్ర నిర్మాత నమ్మకంగా ఉన్నారు. సహజమైన హాస్యానికి, అద్భుతమైన కామెడీ టైమింగ్‌కి పేరుపొందిన సుహాస్, ఈ సినిమాలో హిలేరియస్ పాత్ర పోషించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు మూడు నెలల్లో పూర్తి చేసి, జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.