మోత మోగిస్తున్న సుహాస్..


‘రైటర్ పద్మభూషణ్’ తో మంచి విజయాన్ని అందుకున్న సుహాస్ ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్, స్వేచ్ఛ క్రియేష‌న్స్, వెంక‌టేశ్ మ‌హా నిర్మాణంలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రంతో దుశ్యంత్ కటికనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేస్తున్న ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ మూవీ ఇప్పుడు షూటింగ్ పనులను ముగించుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.

ఇక ఈ సినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా నటిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టే సుహాస్ మ్యారేజ్ బ్యాండు తో కనిపించాడు. ఇక సుహాస్ తో పాటు గోపరాజు రమణ, పుష్ప ఫేమ్ జగదీశ్ డప్పులు, సన్నాయితో పాటు పలురకమైన మంగళవాయిద్యాలతో ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది చిత్ర బృందం.