ప్రభాస్‌గా మారుతున్న సుదీప్‌!

sudeepప్రభాస్ కి ఉన్న లేడీ ఫాలోయింగ్‌ని మ‌రింత పెంచిన చిత్రం మిర్చి. క‌త్తివాడ‌డం మొద‌లెడితే, నాకంటే ఎవ‌రూ బాగా వాడ‌లేడూ – అంటూ మాస్‌, యాక్షన్ సీన్ల‌లోనూ య‌ధావిధిగా రెచ్చిపోయారు. అందుకే ఆ సినిమా బాక్సాఫీసు ద‌గ్గర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించుకొంది. ఇప్పుడు ఈ సినిమా అన్ని భాష‌ల్లోనూ వెళ్లనుంది. హిందీలో జాన్ అబ్రహం ఈ సినిమా చేయ‌నున్నారు. క‌న్నడ లో సుదీప్ రీమేక్ చేయ‌బోతున్నారు. ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకొన్నారు సుదీప్‌. క‌న్నడ‌లో మాస్ హీరో ఆయ‌న‌. ఇప్పుడు మిర్చి సినిమాలో ప్రభాస్ పాత్ర ఆయ‌న క‌న్నడ‌లో పోషించ‌నున్నారు. ద‌ర్శక‌త్వ బాధ్యత కూడా ఆయ‌నే స్వీకరించారు. త్వర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.