సుచిలీక్స్‌పై క్లారిటి ఇచ్చిన గాయని సుచిత్ర

తమిళ గాయని సుచిత్ర సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ధుమారం రేపిన విషయం తెల్సిందే. తారల ప్రయివేటు ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి సంచలనం సృష్టించింది. దాంతో సుచిత్ర భర్త కార్తీక్‌ కుమార్‌ తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, చికిత్స కోసం లండన్‌ తీసుకెళ్తున్నామని ప్రకటించాడు. ఆ తర్వాత సుచి లీక్స్‌ గోల సర్దుమణిగింది. తాజాగా సుచిలీక్స్‌పై గాయని సుచిత్ర స్పందించింది. ఆ లీక్స్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెబుతోంది. తన ట్విట్టర్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేసి, ఇలా ప్రయివేటు ఫొటోలను పోస్ట్‌ చేశారు కానీ తాను అలా చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

తమిళనాడుకు చెందిన ఓ సంస్థ తన అకౌంట్‌ను హ్యాక్‌ చేసి ఇలా కావాలనే ఆ ఫొటోలు పోస్ట్‌ చేసింది తప్పితే తాను మాత్రం ఆ పని చేయలేదు అంటూ సుచిత్ర క్లారిటీ ఇచ్చింది. అప్పుడేమె తన భర్త కార్తీక్‌ సుచి మానసిక పరిస్థితి బాగోలేదని ఎందుకన్నాడు, సుచిత్ర తనపై ఏ తప్పు ఉండకూడదు అలా బుకాయిస్తుందా..?? లేదా నిజంగా సుచిత్రకు ఏం తెలియదా అంటూ మళ్లీ సోషల్‌ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.