Site icon TeluguMirchi.com

సుచిలీక్స్ : వాళ్ల పాపాన వాళ్లే పోతారు

rana trisha news

సుచి లీక్స్‌ పేరిట ట్విట్టర్‌లో పలువురు సినీ తారల వ్యక్తిగత ఫొటోలు లీకవుతూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. మొదటగా పలువురు తమిళ తారల ప్రయివేటు ఫొటోలను లీక్‌ చేసి ఆ తర్వాత అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందని తన తప్పును కప్పిబుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది గాయని సుచిత్ర. తమిళస్టార్‌ హీరో మత్తు మందు ఇచ్చి తనతో శృంగారం చేసి పక్కపై అలాగే వదిలి వెళ్లిపోయాడని ఘాటుగా ట్వీట్‌లు చేసింది. దాంతో ధనుష్‌ సుచిపై ఫైర్‌ కాగా సుచిత్ర భర్త మరియు నటుడు కార్తీక్‌ స్పందించి తన భార్య మానసిక పరిస్థితి బాగోలేదని, మానసిక సమస్యల వల్ల ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొదటగా హ్యాక్‌ అన్నారు. తర్వాత మానసిక సమస్యలు అంటున్నారు. అయితే ఇది నిజంగా హ్యాకా..?? లీకా..?? నే సందేహాలు ప్రేక్షకులను తటపటాయిస్తుంది.

సుచి లీక్స్‌లో త్రిష మరియు రానా ఘాఢంగా ముద్దులాడుతున్న ఫొటో కూడా ఉంది. ఆ ఫొటో టాలీవుడ్‌లో తాజాగా వైరల్‌గా మారింది. దాంతో ఈ లీక్‌ ఫొటోపై ముద్దుగుమ్మ త్రిష స్పందించింది. కర్మ అని ఫొటోపై రాసి పగ తీర్చుకోనక్కర్లేదు. వాళ్ల పాపాన వారే పోతారు. ఎవరైతే మనల్ని భాదపెట్టాలనుకుంటారో… వాళ్లంతట వారే బాదపడుతారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.

త్రిష మరియు రానా ఫొటోపై టాలీవుడ్‌లో పెద్ద రచ్చ జరుగుతుండగా త్రిష ఇంత సింపుల్‌గా స్పందించడంతో అంతా షాకవుతున్నారు. ఈ ఫొటోపై రానా ఎలా స్పందిస్తాడో అని తెలుగు ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. గతంలో రానా, త్రిషలపై అనేక వార్తలు వచ్చినా కూడా ఇద్దరు నో నో అంటూ బయటకు తెలియకుండా చాలా కప్పి పుచ్చుతూ వచ్చారు. తాజాగా రిలీజైన ఈ ఫొటోను చూస్తుంటే ఇద్దరి మద్య ఎంత ఘాటు వ్యవహారం నడిచిందో అర్థమవుతుంది.

Exit mobile version