తమిళ గాయని సుచిత్ర ట్విట్టర్ ఖాతా నుండి పలువురు తారల ప్రయివేటు ఫొటోలు లీకయ్యాయి. తారలు రహస్యంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పెను ధమారం రేపింది సుచిత్ర. దాంతో తమిళ సినీ పరిశ్రమ సుచిత్రపై కారాలు మిరియాలు నూరారు. సుచిత్ర భర్త కార్తీక్ కుమార్ వెంటనే స్పందించి తన భార్య మానసిక పరిస్థితి బాలేదు అని చెప్పుకొచ్చాడు. మానసికంగా దెబ్బతిన్న వారు సోషల్ మీడియాలో ఎలా ఆక్టివ్‌గా ఉన్నారు అనేది చాలా మంది అనుమానాలు. ఆ తర్వాత పెద్ద తలకాయలు తల దూర్చి సుచిత్రను బయటకు రాకుండా చేశారు. ఆమె ప్రస్తుతం లండన్‌లో చికిత్స చేయించుకుంటుంది అని చెబుతున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుచిలీక్స్ రెండో పార్టు కూడా రాబోతుంది. అవును ఇప్పటికే టాలీవుడ్, కోళీవుడ్ స్టార్ల రహస్య సమాచారం తమ దగ్గర ఉందని, తాము అడిగిన మొత్తాన్ని ముట్టజెప్పకపోతే అదంతా కూడా నెట్‌లో దర్శణం ఇస్తుంది అని బెదిరిస్తున్నారట. కాదు కూడదు అంటూ పోలీసులకు కంప్లయింట్ ఇస్తే ఇక ఆగకుండా వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తాం అంటూ హెచ్చరిస్తున్నారట. దాంతో తారలంతా కూడా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. వారు అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫొటోలు కచ్చితంగా షేర్ చేస్తాం అంటున్నారట. ఇదంతా సుచిత్ర చేయిస్తుందా..?? లేదా మరెవరైనా ఇలా చేస్తున్నారా..?? అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇకపోతే ప్రేక్షకులు వాటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.