ఇటీవల కాలంలో ఓ ప్రత్యేకమైన అటెన్షన్ రప్పించుకున్న చిత్రం ‘శుభలేఖ+లు’. పోస్టర్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ చాలా విభిన్నంగా ఉండటంతో అటు ఆడియన్స్ లోను, ఇటుమార్కెట్ లోను ఓ క్యూరియాసిటీ సొంతం చేసుకున్నదీ చిత్రం. ఇందులో నటించిన తారలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ కొత్తవారు కావటం విశేషం. బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి శిష్యుడైన శరత్ నర్వాడే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హనుమా తెలుగు మూవీస్ పతా కంపై సి.విద్యాసాగర్,జనార్దన్ ఆర్.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోశ్రీనివాస్ సాయి, దీక్ష శర్మరైనా హీరో హీరోయిన్లు . ప్రియా వడ్లమాని లీడ్ క్యారెక్టర్ చేసారు. వంశీ నెక్కంటి ,మోనా బే ద్రే ముఖ్య పాత్రదారులు. శ్రీమతి. సుధారాణి ఈ చిత్రానికి సమర్పకురాలు . ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణా రెడ్డి చూసి చాలా ఇంప్రెస్ అయ్యి , ఫ్యాన్సీ ఆఫర్ తో ఈ సినిమా హక్కులను సొంతంచేసుకున్నారు.
ఈ సందర్భంగా బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమా హక్కులని సొంతం చేసుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా రాలేదు . చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది . అటుయూత్, ఇటు ఫ్యామిలిస్ అందరికీ ఈ మూవీ నచ్చుతుందనే నమ్మకo ఉంది ” అని చెప్పారు.
నిర్మాతలు సి.విద్యాసాగర్,జనార్దన్ ఆర్.ఆర్ మాట్లాడుతూ ” సినిమాలో కొత్తదనం ఉంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతున్నారు. కంచరపాలెం,RX100 సినిమాలు ఏ range హిట్అయ్యాయో అందరికి తెలిసిందే. మా సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుంది.బెల్లం రామకృష్ణా రెడ్డి లాంటి అభిరుచి ఉన్న వ్యక్తి ఈ సినిమా హక్కులు తీసుకోవటం మాకు ఆనందం కలిగిస్తోంది. అతి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి సంగీతం: కె.ఎం. రాధాకృష్ణన్, కథ – మాటలు: జనార్దన్ ఆర్.ఆర్. – విస్సు, కథా సహకారం: సి.విద్యాసాగర్, పాటలు: పెద్దాడ మూర్తి, పులగం చిన్నారాయణ , జనార్దన్ ఆర్