రవితేజకి విజయాల కిక్ ఇచ్చిన చిత్రం కిక్. దర్శకుడిగా సురేందర్‌రెడ్డి తీసిన పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రమిది. బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతోంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం మళ్లీ రవితేజ – సురేందర్‌రెడ్డి జత కడుతున్నారు. కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సీక్వెల్‌కి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయిపోయింది. ప్రస్తుతం ఈ స్ర్కిప్టుని తుదిమెరుగులు దిద్దుతున్నారు. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి రేసుగుర్రం పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు రవితేజ పవర్ సినిమాలో పడ్డాడు. రేసుగుర్రం తరవాతే కిక్2 సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కిక్, కిక్ 2ల మధ్య ఏమైనా సంబంధం ఉందా? కిక్ కథ, పాత్రలు సీక్వెల్లోనూ కొనసాగుతాయా? లేదంటే పేరు మాత్రం అలా పెట్టారా? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.