డబ్బింగ్ మొదలెట్టారు!

Courier-Boy-Kalyan‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రం తర్వాత నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. యామి గౌతమ్ హీరోయిన్. ప్రేమ్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రంకు ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ కామెడీ థ్రిల్లర్ గా రుపొందిదని తెలుస్తోంది. నితిన్ కామెడీ థ్రిల్లర్ నటించడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో నితిన్ కోరియర్ బాయ్ పాత్రలో, యామి గౌతమ్ సేల్స్ గర్ల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల చేస్తారు. ఫోటాన్ కథాస్ పతాకంపై గౌతం వాసుదేవమీనన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.