కేన్స్ లో అందాల తారల జోరు

cannesకేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం నాలుగో రోజున అందాల తారలు తళుక్కున మెరిశారు. రెడ్ కార్పెట్ పై అందాలు ఆరబోస్తూ నడిచారు. జెన్నిఫర్ లారెన్స్, లైమ్ హామ్స్ వర్త్, ఈవా లాంగోరియా లతో బాటు పలువురు సుందరిమణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాళ్ళను తమ కెమెరాల్లో బంధించేందుకు గానూ ఫోటోగ్రాఫర్లు పోటీలు పడ్డారు. ఈ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయ సినిమా వందేళ్ళ వేడుకలు కూడా ఘనంగా జరిపారు. బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన పలువురు సెలెబ్రిటి లు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సొనమ్ కపూర్, మల్లికా షెరావత్ లాంటి స్టార్స్ ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.