SSMB 28 లేటెస్ట్ అప్ డేట్


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 28 మూవీ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరాం, హైపర్ ఆది, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని మార్చి 22న ఉగాది రోజున ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో ఈరోజు రెండు ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. SSMB 28 సెట్స్ నుంచి బయటకి వచ్చిన రెండు ఫోటోస్ లో మహేశ్ బాబు మస్త్ ఉన్నాడు. ఒక ఫోటోలో మహేశ్ బాబుతో పాటు యాక్టర్ జైరామ్ ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను, ఈరోజు ఆయన కొడుకుతో కలిసి నటిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అంటూ జైరామ్, మహేశ్ బాబుతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెట్స్ లో జాయిన్ అయిన జైరామ్ మొదటి రోజు కావడంతో మహేశ్ బాబుతో, త్రివిక్రమ్ తో ఫోటోలు దిగాడు. త్రివిక్రమ్, మహేశ్ బాబు, జైరామ్ ఉన్న ఫోటో కూడా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.