‘శృతి’ మించుతుంది..

sruthi-provkeకమల్ కూతురిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శృతి హాసన్ , కెరియర్ మొదట్లో చాలానే ఆటుపోట్లు ఎదురుకుంది. ఈమె హీరోయినిగా పనికిరాదు అనుకునే టైం లో గబ్బర్ సింగ్ తో తన కెరియర్ రూపురేఖలే మారిపోయాయి. అప్పటినుండి అమ్మడు వెనుకకుచూసుకోలేదు.

కేవలం సినిమాలతోనే కాదు హాట్ హాట్ ఫోటో షూట్ లతోను అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఆ మధ్య ‘GQ’ మ్యాగజిన్ కోసం అమ్మడు ఏమాత్రం ఆలోచించకుండా అందాల ఆరబోత చేసింది. ఆ ఫోటో షూట్ ఆ టైం లో రచ్చ రచ్చ చేసాయి. తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది.

ఇటీవల ప్రొవోక్ అవార్డు ఫంక్షన్ కు హాజరైన శృతి హాసన్ ను చూసి అక్కడి జనాలు కళ్ళు తిప్పుకోలేక పోయారట. అమ్మడి డ్రెసింగ్ నుండి మొదలు పెడితే స్కిన్ షో వరకూ ప్రతీ విషయంలోనూ రెచ్చి పోయిందట. క్లీవేజ్ షో చేయకుండానే.. తన స్టైల్ లో గ్లామర్ వర్షం కురిపించేసిందట. ఇక ఫోటోగ్రాపర్లకు అయితే ఈమె అందాలను తమ కెమెరా లలో ఫుల్ గా బాధించారట.