ఇంగ్లాండ్‌కు చెందిన స్టేజ్ ఆర్టిస్టు అయిన మైకేల్ అనే వ్యక్తితో శృతిహాసన్ ప్రేమ వ్యవహారం ఇటీవలే అధికారికంగా బయటకు వచ్చింది. వీరిద్దరు తరచు బయట కలుసుకోవడం, విదేశాల్లో ఇద్దరు చక్కర్లు కొట్టడం చూసి అంతా అవాక్కయ్యారు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరు కూడా క్రిస్టియన్ మతాచారం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరిద్దరి విషయం కమల్ హాసన్‌కు తెలవడం ఆయన ఆగ్రహంతో ఉన్నాడని తమిళ సినీ పరిశ్రమ వర్గాలు అంటున్నారు. వీరి పెళ్లి అయ్యి కూడా దాదాపు మూడు నెలలు అవుతుందని అంటున్నారు. పెళ్లి అయ్యిందని తెలిస్తే అవకాశాలు తగ్గుతాయనే ఉద్దేశ్యంతో పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది.